ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10 బీసీ గురుకులాలు రానున్నాయి. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2026-27) నుంచి బాలురు ఐదు, బాలికలకు ఐదు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ గురుకులాల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే చెప్పడంతో కేబినెట్‌లో పెట్టి ఆమోదించనున్నారు. మొదటి సంవత్సరంలో ఒక్కో గురుకులంలో 240 అడ్మిషన్లు ఉంటాయి.. 2027-2028 విద్యా సంవత్సరం నుంచి 480కి పెంచనున్నారు. రాష్ట్రంలో 10 కొత్త గురుకులాల ఏర్పాటుతో 4,800 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వాస్తవానికి 20 కొత్త గురుకులాలు ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదించింది. మొదటి విడతలో 10 గురుకులాలకు ఓకే చెప్పారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుకానున్న 10 బీసీ గురుకులాలను 8 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. అది కూడా బీసీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (బాలికలు), అనకాపల్లి జిల్లాలో నక్కపల్లిలో (బాలికలు), పల్నాడు జిల్లా మాచర్లలో (బాలికలు), మార్కాపురం జిల్లా గిద్దలూరులో (బాలురు), అనంతపురం జిల్లా గుంతకల్లులో (బాలికలు), అన్నమయ్య జిల్లా రాయచోటిలో (బాలురు), కర్నూలు జిల్లా పత్తికొండలో (బాలురు), మంత్రాలయంలో (బాలికలు), శ్రీసత్యసాయి జిల్లాలో పెనుకొండ (బాలురు), కదిరి (బాలురు) గురుకులాలు ఏర్పాటు చేయనున్నారు.పెనుకొండ, పత్తికొండలో ఇప్పటికే బీసీ గురుకులాలు ఉండగా.. మిగతా అన్ని ప్రాంతాల్లో బీసీ గురుకులాలు లేని ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాదికి ఈ గురుకులాలను అద్దె భవనాల్లో నిర్వహఇంచి.. ఆ తర్వాత కొత్త భవనాలు నిర్మిస్తారు. కొత్త గురుకులాలను బీసీ హాస్టల్స్‌లో 10 నుంచి 30 మంది విద్యార్థులుండే ప్రాంతాలను ప్రాతిపదికగా ఎంపిక చేశారు. ఆ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులందరినీ ఈ గురుకులాల్లో చేర్పిస్తారు.. అప్పుడు బీసీ హాస్టల్స్ నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది అంటున్నారు. ఏడాదికి రూ.13 కోట్లు 60 బీసీ వసతిగృహాలకు అయ్యే ఖర్చుగా లెక్కించారు. మొత్తం మీద రాష్ట్రంలో కొత్తగా బీసీ
Actor ProfilePolitician
ఏపీలోని ఈ జిల్లాల్లో కొత్తగా 10 గురుకులాలు ఏర్పాటు.. అదనంగా 4
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•4 Jul 2026
ఏపీలోని ఈ జిల్లాల్లో కొత్తగా 10 గురుకులాలు ఏర్పాటు.. అదనంగా 4,800 సీట్లు