ఏపీలోని ఆ విమానాశ్రయంలో రాత్రిళ్లు ల్యాండింగ్ .. సర్వీసులు పెంపు
Actor ProfilePolitician

ఏపీలోని ఆ విమానాశ్రయంలో రాత్రిళ్లు ల్యాండింగ్ .. సర్వీసులు పెంపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలోని ఆ విమానాశ్రయంలో రాత్రిళ్లు ల్యాండింగ్ .. సర్వీసులు పెంపు, నిర్ణయం
Samayam Telugu28 Jun 2026
ఏపీలోని ఆ విమానాశ్రయంలో రాత్రిళ్లు ల్యాండింగ్ .. సర్వీసులు పెంపు, నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విమానాశ్రయాల్లో మెరుగైన వసతులు కల్పించడంపై ఫోకస్ పెట్టింది. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు వేగవంతం చేయగా.. తాజాగా మరో ఎయిర్‌పోర్ట్‌ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఏపీఏడీసీఎల్‌ (ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ) కర్నూలు ఎయిర్‌పోర్టులో ఇంటిగ్రేటెడ్‌ ఏవియేషన్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. రాత్రిళ్లు విమానాశ్రయంలో ల్యాండింగ్, సర్వీసుల సంఖ్య పెంపు వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టిపెట్టారు. సిటీసైడ్‌ కమర్షియల్‌ భవనాలను అభివృద్ధి చేయాలని కూడా భావిస్తున్నారు.కర్నూలు విమానాశ్రయ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా రాత్రిళ్లు ల్యాండింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనుకుంటున్నారు. ఈ మేరకు డీవీఓఆర్‌ (డాప్లర్‌ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్నిడైరెక్షనల్‌ రేంజ్‌) ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ డీవీఓఆర్ ద్వారా పైలట్లకు నేవిగేషన్‌ సమాచారాన్ని అందిస్తారు. ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్, వేర్‌హౌసింగ్, టూలింగ్ సహా ఇతర మౌలిక సదుపాయాలు తీసుకురానున్నారు. అలాగే మరికొన్ని సదుపాయాల అభివృద్ధి చేయనున్నారు. కర్నూలు ఎయిర్‌పోర్ట్‌లో మౌలిక సదుపాయాల కోసం ప్రస్తుతం భూమి అందుబాటులో ఉంది.. దీనిలో కొంత భూమిని అభివృద్ధికి ఉపయోగించనున్నారు. కర్నూలు విమానాశ్రయంలో రాబోయే రోజుల్లో 136 ఎకరాలలో రన్‌వే విస్తరణ, విమానాశ్రయ అభివృద్ధి, టెర్మినల్‌ భవనాల విస్తరణ, ఇతర ఏరోనాటికల్‌ సదుపాయాల కోసం అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించారు. సిటీసైడ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో భాగంగా 343 ఎకరాలలో కమర్షియల్ భవనాలు, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్, తయారీ, ఏవియేషన్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చేయాలనే ఆలోచన చేశారు. ఇతర అవసరాల కోసం మరో 100 ఎకరాలను రిజర్వ్‌లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీఏడీసీఎల్‌ కర్నూలు విమానాశ్రయానికి సంబంధించి నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల కోసం క్రాంట్రాక్టర్‌లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఏపీఏడీసీఎల్ ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌తో రాయితీ ఒప్పందం చేసుకోనుంది.కాంట్రాక్టర్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేలు, టెర్మినల్‌ భవనాలు, టాక్సీవే, ఎయిర్‌సైడ్, ల్యాండ్‌సైడ్‌, యుటిలిటీస్‌ వంటివి నిర్వహించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ మేనేజ్‌మెంట్, ఆపరేసన్స్, డెవల్‌మెంట్‌‌ను సీవోడీ నాటికి కనీస అభివృద్ధి చేయాలి