ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండ్ మారుతోంది.. కొంతకాలంగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయి. సర్కారీ బడులు మాత్రమే కాదు హాస్టల్స్‌లో కూడా అడ్మిషన్ల కోసం పోటీ పెరిగింది. అనకాపల్లి జిల్లాలోని ఆ ప్రభుత్వ హాస్టల్‌లో సీటు అంత ఈజీ కాదు.. ఎంపీ, ఎమ్మెల్యేలతో రికమండేషన్ చేయిస్తారు. కొంతకాలంగా ఈ హాస్టల్‌లో సీటు కోసం పిల్లలు, తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. అడ్మిషన్లు లేవని అక్కడి సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనక్కు వెళుతున్నారు. దీన్ని బట్టి ఆ హాస్టల్‌లో సీటు కోసం ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అనకాపల్లిలోని బీసీ బాలుర హాస్టల్‌లో సీటు కోసం తల్లిదండ్రులు క్యూ కట్టారు. ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీల లెటర్‌లు ఇచ్చారు.. పిల్లలకు సీటు కావాలంటూ అడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హాస్టల్‌కు ఈ ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరగాయి.. దీంతో సీట్లు సర్దుబాటు చేయడం సిబ్బందికి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. హాస్టల్‌లో సీట్లు మొత్తం భర్తీ అయ్యాయని.. దయచేసి ఎవరూ రావద్దని సిబ్బంది చెబుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సు లేఖలతో వచ్చినా ఫలితం లేదని చెప్పి పంపిస్తున్నారు. ప్రభుత్వ హాస్టల్‌లో సీట్ల కోసం డిమాంగ్ పెరగడం ఆసక్తికరంగా మారింది. అనకాపల్లిలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌లో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు 140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ హాస్టల్‌లో ఇప్పటికే 160 మంది చేరారు. అయినా సరే సీటు కావాలంటూ ఎంపీ, ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో తల్లిదండ్రులు హాస్టల్ దగ్గరకు వస్తున్నారని చెబుతున్నారు.గతంలో ఈ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరగా.. గత ప్రభుత్వ హయాంలో ఎంపీ నిధులు రూ.20 లక్షలతో మరమ్మతు పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎస్ఆర్ కింద ఫైజర్ కంపెనీ రూ.28 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టింది. హాస్టల్‌కు శ్లాబ్ వేసి, అన్ని రిపీర్లే చేయించి
Actor ProfilePolitician
ఏపీలోని ఆ ప్రభుత్వ హాస్టల్ లో సీట్లకు డిమాండ్.. ఎంపీలు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•1 Aug 2026
ఏపీలోని ఆ ప్రభుత్వ హాస్టల్ లో సీట్లకు డిమాండ్.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో రికమండేషన్ లెటర్లు