ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రైల్వే జంక్షన్ అందుబాటులోకి రానుంది. రెండేళ్లలో కుప్పం రైల్వే జంక్షన్‌గా మారనుంది. కర్ణాటకలోని మారికుప్పం నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకూ కొత్త రైల్వేట్రాక్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనులలో రైల్వే అధికారులు వేగం పెంచారు. ప్రస్తుతం ఈ మార్గంలోని భూములను చదును చేసే పనులు జరుగుతున్నాయి. కర్ణాటక సరిహద్దుల నుంచి ఏపీ సరిహద్దు వరకు భూమిని చదును చేసే పనులను చేపడుతున్నారు. ఇందులో ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి . అలాగే బిసానత్తం నుంచి కుప్పం వరకు 18 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం 269 ఎకరాల భూమిని సేకరించారు. ఈ నూతన రైలు మార్గం ఏర్పాటు కోసం రూ.363 కోట్లు అంచనాలతో పనులు జరుగుతున్నాయి. 2028 మార్చికల్లా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులలో ఉంటుంది కుప్పం. రెండు రాష్ట్రాలకు సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై బెంగళూరు రైల్వే మార్గంలో కుప్పం రైల్వేస్టేషన్ ఉండటంతో.. రోజూ పదుల సంఖ్యలో రైళ్లు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రైల్వేశాఖ కుప్పం రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే 2011లో కుప్పం - మారికుప్పం మధ్యన కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశారు. 23.7 కి.మీ. మేరకు కుప్పం రామకుప్పం కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ అధికారులు ప్రణాళికలు రచించారు. కుప్పం, మల్దేపల్లె, నక్కనపల్లి, గుండ్లసాగరం, కనమనపల్లె, అగరం, కుప్పిగానిపల్లి, కోటచెంబగిరి, పొగురుపల్లె, బిసానత్తం, అత్తిసత్తం మీదుగా మారికుప్పం వరకూ ఈ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసింది. అలాగే మారికుప్పం ప్రాంతం నుంచి కర్ణాటక సరిహద్దు వరకు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యి కుప్పం-మారికుప్పం రైల్వేట్రాక్ అందుబాటులోకి
Actor ProfilePolitician
ఏపీలో కొత్త రైల్వే లైన్.. జంక్షన్ గా మారనున్న రైల్వేస్టేషన్.. ఆ ప్రాంతం దశ తిరిగినట్లే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•2 Jul 2026
ఏపీలో కొత్త రైల్వే లైన్.. జంక్షన్ గా మారనున్న రైల్వేస్టేషన్.. ఆ ప్రాంతం దశ తిరిగినట్లే