
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కాం భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. అమరావతి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కాం భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఈ కుంభకోణంలో 50మందికి పైగా ముద్దాయిలు ఉన్నారని తెలిపారు. ఈరోజు (సోమవారం) అమరావతి వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. జగన్ నేతృత్వంలో జరిగిన అక్రమాల్లో మరిన్ని అసలు వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఈడీ కూడా దీనిపై విచారణ చేపట్టడంతో కొత్త పేర్లు కూడా బయటకు వస్తాయని తెలిపారు. మద్యం కుంభకోణంలో సూత్రదారులెవ్వరూ తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. అస్తవ్యస్త విధానాలతో ఎక్సైజ్ శాఖను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా పడిపోయిందని మండిపడ్డారు. సొంత బ్రాండ్ల ప్రమోషన్ కోసం నాణ్యమైన బ్రాండ్లను తొక్కేశారని దుయ్యబట్టారు. డిజిటల్ పేమెంట్లు లేకుండా పారదర్శకత దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా వ్యవస్థను సరి చేశామని స్పష్టం చేశారు. మద్యం అక్రమాలపై సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తున్న మద్యం పాలసీపై మాజీ మంత్రి జోగిరమేశ్ నేతృత్వంలో వైసీపీ నేతలు చెడ్డపేరు తీసుకురావాలని చూసి అడ్డంగా దొరికిపోయారని ఆగ్రహించారు. 13రకాల పరీక్షల తర్వాతే నాణ్యమైన మద్యాన్ని బయటకు పంపుతూ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు గ్రాండ్ వెల్‌కమ్