ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విమానాశ్రయాల్లో వైన్ షాపులు, బార్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం నుంచి తిరుపతి విమానాశ్రయానికి (రేణిగుంట) మినహాయింపు ఇచ్చారు. తిరుపతి విమానాశ్రయం తప్ప రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ లిక్కర్ విక్రయాలకు పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలోని ఎయిర్‌పోర్టులలో 24 గంటల పాటు బార్లు, వైన్ షాపులలో మద్యం అందుబాటులో ఉండనుంది. అలాగే విమానాశ్రయాల్లో బార్లు, వైన్ షాపులకు సంబంధించిన లైసెన్స్ ఫీజులు, పన్నులపైనా కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎయిర్‌పోర్టులలో బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజును రూ.5 లక్షలుగా నిర్ణయించారు. మద్యం షాపుల దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. అలాగే విమానాశ్రయాల్లో వైన్ షాపు ఎక్సైజ్ ట్యాక్స్ రూ.2 కోట్లుగా నిర్ణయించారు. 20 లక్షల సర్క్యులేషన్ దాటిన విమానాశ్రయాల్లోని బార్లకు రూ.25 లక్షల ఎక్సైజ్ ట్యాక్స్, సర్క్యులేషన్ 20 లక్షల లోపు ఉంటే ఎక్సైజ్ ట్యాక్స్ రూ.15 లక్షలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు సంవత్సరాల తర్వాత ఎక్సైజ్ విధానంపై సమీక్షిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.మరోవైపు ఎయిర్‌పోర్టులలో లిక్కర్ అమ్మకాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విమాన ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్టు టెర్మినళ్లలో బార్లు, లాంజ్స్, డ్యూటీ ఫ్రీ షాపులు ఉంటాయి. వీటి ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులలో పన్ను మినహాయింపులతో డ్యూటీ ఫ్రీ స్టోర్స్ నడుపుతుంటారు. ఈ డ్యూటీ ఫ్రీ షాపులలో వైన్, విస్కీ, ఖరీదైన బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. ఇక ప్రయాణికులు తాగడానికి వీలుగా విమానాశ్రయం లోపల బార్లు, లాంజ్స్ ఏర్పాటు చేస్తారు. వీటిని ఏర్పాటు చేయాలంటే లైసెన్స్, అనుమతి
Actor ProfilePolitician
ఏపీలో ఎయిర్ పోర్టుల్లోనూ మద్యం అమ్మకాలు.. ఆ ఒక్కటి తప్ప
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•4 Aug 2026
ఏపీలో ఎయిర్ పోర్టుల్లోనూ మద్యం అమ్మకాలు.. ఆ ఒక్కటి తప్ప