ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు..! ఎవరెవరికంటే
Actor ProfilePolitician

ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు..! ఎవరెవరికంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు..! ఎవరెవరికంటే
Oneindia Telugu3 Sept 2026
ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు..! ఎవరెవరికంటే

ఏపీ ప్రభుత్వం (AP Govt) ఇవాళ ఉద్యోగుల (Employees) రిటైర్మెంట్ వయస్సు విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకూ ఉన్న వారి రిటైర్మెంట్ వయస్సు రెండేళ్లు పెరకబోతోంది. ప్రభుత్వ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జగన్ మావిగన్ సవాల్ కు స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది. గతంలో దీనిపై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఇవాళ అధికారికంగా జీవో జారీ చేశారు. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమలవుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగుల్ని సైతం తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం కూడా లభించింది. ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఇక తాడోపేడో..! ఉద్యోగుల జేఏసీ కీలక ప్రకటన..!అయితే వీరికి తిరిగి విధుల్లో చేరే వరకు ఉన్న గ్యాప్‌ పీరియడ్‌కు మాత్రం జీతం ఉండదని ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇచ్చింది. అలాగే ఈ కాలాన్ని సీనియారిటీ, ప్రమోషన్ల కోసం కూడా పరిగణనలోకి తీసుకోరని తెలిపింది. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వరకు పనిచేసిన ఉద్యోగులకు పూర్తి స్థాయి సర్వీస్ ప్రయోజనాలు సైతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 60 ఏళ్లకు పదవీ విరమణ పొంది తిరిగి విధుల్లో చేరేందుకు ఆసక్తి లేని ఉద్యోగులకు మాత్రం పాత నిబంధనల ప్రకారమే రిటైర్మెంట్ వర్తింపచేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సర్వీస్ రూల్స్‌లో అవసరమైన సవరణలు చేయాలని ఆదేశాలిచ్చింది