ఏపీలో ఆ పిల్లలకు నెలకు రూ.4వేలు.. దరఖాస్తు చేసుకునేందుకు త్వరపడండి
Actor ProfilePolitician

ఏపీలో ఆ పిల్లలకు నెలకు రూ.4వేలు.. దరఖాస్తు చేసుకునేందుకు త్వరపడండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో ఆ పిల్లలకు నెలకు రూ.4వేలు.. దరఖాస్తు చేసుకునేందుకు త్వరపడండి
Oneindia Telugu31 Jul 2026
ఏపీలో ఆ పిల్లలకు నెలకు రూ.4వేలు.. దరఖాస్తు చేసుకునేందుకు త్వరపడండి

ఏపీలో తల్లిదండ్రులు లేని పిల్లలు, ఆదరణ లేని చిన్నారుల జీవితాల్లో చీకట్లు తొలగించే మంచి పథకం మళ్లీ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన పిల్లలకు ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఆరు నెలలకు ఒకసారి జమ చేస్తారు.ఏపీలో మిషన్ వాత్సల్య పథకంమిషన్ వాత్సల్య పథకం ద్వారా సంవత్సరానికి రూ.48,000వరకు అనాధ పిల్లలకు మద్దతు లభిస్తుంది.ఈ సాయం పిల్లలు 18ఏళ్లు వచ్చే వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ లేని అనాథపిల్లలు, ఒక తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్నవారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే తల్లిదండ్రుల పిల్లలు, యాసిడ్ అటాక్ బాధితులు, విడాకులు తీసుకున్న దంపతుల పిల్లలు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులు ఈ పథకానికి అర్హులు.దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవేదరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం. పిల్లల బర్త్ సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాపీలు, బ్యాంక్ పాస్‌బుక్ వంటివి సమర్పించాలి. ఈ డాక్యుమెంట్లన్నీ గెజిటెడ్ అధికారి సంతకంతో ధృవీకరించాలి. స్థానిక అంగన్‌వాడీ వర్కర్, సూపర్‌వైజర్, సీడీపీవో లేదా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులను సంప్రదిస్తే పూర్తి వివరాలు, అప్లికేషన్ ఫారం లభిస్తాయి.ఏపీలోనే ఆ జాతీయ పథకం ప్రారంభం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్!కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటాతో పథకం అమలుప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న పిల్లలకు ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.72,000 మించకూడదు. పట్టణాల్లో రూ.96,000 లోపు ఉండాలి. 2026 మార్చి 31 నాటికి వయసు 18 ఏళ్లలోపు ఉండాలి. ఈ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటా వేస్తాయి.నేను గుంపు మేస్త్రినే