ఏపీలో ఆ టీచర్లు నక్కతోక తొక్కారు.. ఫిన్ ల్యాండ్ వెళ్తున్నారు.. ఎందుకంటే
Actor ProfilePolitician

ఏపీలో ఆ టీచర్లు నక్కతోక తొక్కారు.. ఫిన్ ల్యాండ్ వెళ్తున్నారు.. ఎందుకంటే

Total News1
Movie Updates0
Sources1
ఏపీలో ఆ టీచర్లు నక్కతోక తొక్కారు.. ఫిన్ ల్యాండ్ వెళ్తున్నారు.. ఎందుకంటే
Oneindia Telugu13 Jun 2026
ఏపీలో ఆ టీచర్లు నక్కతోక తొక్కారు.. ఫిన్ ల్యాండ్ వెళ్తున్నారు.. ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను అంతర్జాతీయ స్థాయికి ఉన్నతీకరించడానికి కొత్త చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్‌కు పంపి అక్కడి అత్యాధునిక బోధనా విధానాలను నేర్చుకునే అవకాశం కల్పించనుంది. గత సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న 29 మంది టీచర్లను ఈ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఎంపిక చేసింది.ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ లో చేసేది ఇదే ఈ కార్యక్రమం మూడు దశల్లో జరుగనుంది. మొదటి దశ శిక్షణ విజయవాడలోని లయోలా కాలేజీలో జూన్ 13 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఫిన్‌లాండ్ విద్యా నిపుణులు ఈ సెషన్లను నిర్వహించి, ప్లే బేస్డ్ లెర్నింగ్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.రెండవ దశలో ఆగస్టు 17 నుంచి 26 వరకు ఎంపికైన ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్‌లోని తుర్కు మరియు రౌమా నగరాలకు తీసుకెళ్తారు.ఫిన్ ల్యాండ్ లో బోధనా పద్దతులను పరిశీలించనున్న ఏపీ టీచర్స్ అక్కడి ప్రీ-స్కూళ్లు, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్లు, టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్లను సందర్శించి, క్లాస్‌రూమ్ ప్రాక్టీసులు, వినూత్న బోధనా పద్ధతులను పరిశీలిస్తారు. ఫిన్‌లాండ్ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బోధనా విధానాలు ఆలోచనా సామర్థ్యాలు, సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయి కనుక ఇక్కడ స్కూల్స్ లో విద్యా విధానాన్ని వీరు పరిశీలిస్తారు.ఫిన్ ల్యాండ్ లో నేర్చుకున్నది ప్రభుత్వ స్కూల్స్ లో అమలు మూడవ దశలో ఫిన్‌లాండ్ పర్యటనలో నేర్చుకున్న విషయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాల్సి ఉంటుంది. తుర్కు యూనివర్సిటీ ఫ్యాకల్టీ సభ్యులు ఆన్‌లైన్ మెంటారింగ్ ద్వారా ఉపాధ్యాయులకు సహాయం అందిస్తారు.ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడం, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకమైన కుక్క మృతి!ప్రభుత్వ విద్యను ఆధునికీకరించడంలో మైలురాయిసమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ