ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ
Actor ProfilePolitician

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ
Zee Telugu12 Aug 2026
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. AP New Pension Release Date 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పంపిణీకి సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ క్రమంలో అర్హులైన పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా స్పౌజ్ కేటగిరీ కింద ఎంపికైన వారికి కూడా జులై ఒకటో తేదీనే పింఛన్లు అందించనున్నట్లు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఒకే రోజు రూ.2,711 కోట్లు పంపిణీ.. వచ్చేనెల ఒకటవ తేదీన అందించే పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,711 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,19,648 మంది పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసమే రికార్డు స్థాయిలో రూ.68,598.44 కోట్లను ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. స్పౌజ్ పింఛన్ అంటే ఏమిటి? ప్రభుత్వ నుంచి ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారుడు (భర్త) ఒకవేళ మరణిస్తే ఆ కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయి బాధ మిగలకుండా ఆసరా నిలిచేందుకు ఈ పింఛన్లు ప్రవేశపెట్టారు. భర్త మరణం తర్వాత పింఛన్ ను అతని భార్యకు బదిలీ చేస్తారు. స్పౌజ్ కేటగిరీ కింద ఎంపికైన లబ్ధిదారులకు నెలకు రూ.4,000 చొప్పున ఆర్థికసాయం అందుతుంది. ఈనెల కొత్తగా 7,792 మందికి స్పౌస్ పెన్షన్లు మంజూరు అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం