
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. AP Power Sector Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పించాలని నిర్ణయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు విద్యుత్ సంస్థలు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశాయి. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయమై మాట్లాడుతూ.. "గత కొంతకాలంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉంద"ని అన్నారు. రాబోయే రోజులు జాబ్ క్యాలెండర్ ద్వారా అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో ఖాళీల వివరాలు.. ఈ భార్తీ నియామక ప్రక్రియలో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో లతోపాటు వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలలో (డిస్కమ్స్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 629 పోస్టులను విభజన చేసి వివిధ సంస్థలకు కేటాయించారు. ఏపీ ట్రాన్స్‌కోలో 200, ఏపీ జెన్‌కోలో 100, ఏపీఎస్పీడీసీఎల్‌లో 134, ఏపీసీపీడీసీఎల్‌లో 60, ఏపీఈపీడీసీఎల్‌లో 135 ఏఈఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దరఖాస్తు తేదీలు APSPDCL పరిధిలో దరఖాస్తులు: దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) పరిధిలోని పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జూన్ 30 నుండి జూలై 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ