ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు
Actor ProfilePolitician

ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు
Zee Telugu6 Sept 2026
ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. AP Government:రాష్ట్ర మంత్రిమండలి గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణిస్తారు. అంటే ఈ తేదీ నుంచి రిటైర్మెంట్‌కు సంబంధించిన మార్పులు వర్తిస్తాయి. 60 ఏళ్ల వయసులో ఇప్పటికే పదవీ విరమణ చేసిన అర్హత ఉన్న ఉద్యోగులకు తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. అయితే ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే వరకు ఉన్న గ్యాప్ కాలానికి ఎలాంటి జీతం చెల్లించబోదని స్పష్టం చేసింది. అలాగే ఆ గ్యాప్ కాలాన్ని సీనియారిటీ లేదా పదోన్నతుల కోసం కూడా లెక్కలోకి తీసుకోరని తెలిపింది. ఇప్పటికే కోర్టు ఆదేశాల ప్రకారం 62 ఏళ్ల వరకు పనిచేసిన ఉద్యోగులకు పూర్తి స్థాయి సర్వీస్ ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వారికి ఉద్యోగ కాలానికి సంబంధించిన అన్ని నిబంధనల ప్రకారం లాభాలు అందనున్నాయి. అయితే 60 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకుని మళ్లీ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపని వారికి పాత నిబంధనల ప్రకారమే పదవీ విరమణ కొనసాగుతుంది. వారికి ఇప్పటికే అమలులో ఉన్న రిటైర్మెంట్ నిబంధనలే వర్తిస్తాయి. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సూచించింది. అలాగే ప్రతి సంస్థ తమ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని