ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి.. డైరెక్ట్ లింక్ ఇదే
Actor ProfilePolitician

ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి.. డైరెక్ట్ లింక్ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి.. డైరెక్ట్ లింక్ ఇదే, వెంటనే చెక్ చేసుకోండి
Zee Telugu19 Jun 2026
ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి.. డైరెక్ట్ లింక్ ఇదే, వెంటనే చెక్ చేసుకోండి

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. AP SSC Advanced Supplementary Results 2026 Out: నిన్న జూన్ 18న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన తర్వాతి రోజే, ఈరోజు పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను కూడా ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్‌ లో ఫలితాలు అందుబాటులో ఉన్నట్లు నారా లోకేష్ తెలిపారు. SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది 82.39 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు కాగా, ఇది గత ఏడాది సాధించిన 76.14 శాతంతో పోలిస్తే 6.25 శాతం ఎక్కువగా ఉందని సమాచారం. పదవ తరగతి పరీక్షల అనంతరం విద్యార్థులకు కేంద్రీకృత విద్యా సహాయం, వ్యక్తిగత మార్గదర్శకత్వం కోసం 20 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పాటు మనమిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా లేదా లీప్ మొబైల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని ఎక్స్ (X) వేదికగా లోకేష్ వివరించారు. పాస్ అయిన విద్యార్థులను అభినందిస్తూనే, ఈ విజయంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాల కృషి కూడా ఉందని మంత్రి లోకేష్ కొనియాడారు. విద్యార్థులు తమ భవిష్యత్తు ప్రయాణంలో ఇలాగే విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించింది. ఈ పరీక్షలు మే 25 నుండి జూన్ 4 వరకు జరిగాయి. అనంతరం జూన్ 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ జరిగింది. పదవ తరగతి సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు తమ