ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ
Actor ProfilePolitician

ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ

Total News1
Movie Updates0
Sources1
ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్
Oneindia Telugu13 Jun 2026
ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్

నోరులేని మూగజీవాల సంక్షేమం విషయంలో కోర్టులు మూగప్రేక్షకుడిలా కూర్చోలేవని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేరళలోనే అత్యంత ఎత్తైన ఏనుగుగా పేరొందిన రామన్ కస్టడీ వివాదంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను, దాని ప్రస్తుత సంరక్షకుడిని తప్పుబడుతూ న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. ఏనుగును తక్షణమే కేరళ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని, పునరావాస కేంద్రానికి తరలించాలని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.మూగజీవాల సంక్షేమమే మాకు ముఖ్యం!కోర్టుకు ఇచ్చిన హామీని బేఖాతరు చేస్తూ రామన్ను వాణిజ్య, ఆలయ ఉత్సవాలకు ఉపయోగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కేరళలోనే అత్యంత ఎత్తైన ఏనుగు అయిన రామన్‌ను కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా వాడుకోవడం నిజంగా దురదృష్టకరం. కోర్టుకు ఇచ్చిన అండర్ టేకింగ్‌ను సైతం పక్కనబెట్టి ఇలా ప్రవర్తించడం సరికాదు. నోరులేని ప్రాణుల సంక్షేమం మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతుంటే మేము కళ్ళు మూసుకుని కూర్చోలేము, అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.అసలేమిటీ వివాదం?రామన్ అనే ఏనుగు యాజమాన్య హక్కులపై గత కొంతకాలంగా జయకృష్ణ మీనన్, కృష్ణన్‌కుట్టి అనే ఇద్దరి మధ్య సుదీర్ఘ వివాదం నడుస్తోంది. ఈ ఏనుగు మాతా అమృతానందమయి మఠంకు చెందినదని, కేవలం చూసుకోవడానికే కృష్ణన్‌కుట్టికి ఇచ్చారని జయకృష్ణ మీనన్ వాదిస్తున్నారు. అయితే 2017లో జరిగిన గిఫ్ట్ డీడ్స్ (బహుమతి పత్రాల) ప్రకారం ఈ ఏనుగు తనదేనని కృష్ణన్‌కుట్టి చెబుతున్నారు. ఈ కస్టడీ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? కోర్టు హామీని తుంగలో తొక్కి..ఈ కేసు విచారణలో భాగంగా గత ఏడాది (ఆగస్టు 6, 2025న) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏనుగు ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించడంతో పాటు.. కేసు తేలేవరకు ఏనుగును ఎలాంటి ఆలయ ఉత్సవాలకు, కమర్షియల్ కార్యక్రమాలకు వాడబోమని కృష్ణన్‌కుట్టి