
బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif ) ఏడాదిన్నర తర్వాత వెండి తెరపై అలరించబోతున్నారు. చివరి సారిగా ఆమె 2024 డిసెంబరులో విడుదలైన ‘మేరీ క్రిస్మ్‌స’తో ప్రేక్షకులను మైమరిపించారు. గతేడాది నవంబరులో పండంటి బాబుకు జన్మనిచ్చిన కత్రినా.. మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు కొన్నాళ్లపాటు నటనకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె కొత్త ప్రాజెక్టులేవీ చేయలేదు. కత్రినా కమ్‌బ్యాక్ ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు త్వరలోనే తీపి కబురు అందబోతున్నది. మధుర్ భండార్కర్ (Madhur Bhandarkar) నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ‘చాందినీ బార్ 2’ (Chandni Bar 2) చిత్రంలో నటించేందుకు కత్రినా కైఫ్ చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. టబు లీడ్ రోల్‌లో నటించిన ‘చాందినీ బార్’ 2001లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని మధుర్ భండార్కర్ తెరకెక్కించారు. దీనికి సీక్వెల్‌గా ‘చాందినీ బార్ 2’ రాబోతోంది. ‘సెక్షన్ 375’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ బహల్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తారు. ఇందులో టబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును ఏడాది క్రితం అనౌన్స్ చేశారు. అయితే ఇందులో నటించబోయే ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో! ‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా? వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!