ఏఐని అతి’గా వాడి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్ ను హ్యాక్ చేసి
Actor ProfilePolitician

ఏఐని అతి’గా వాడి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్ ను హ్యాక్ చేసి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏఐని అతి’గా వాడి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్ ను హ్యాక్ చేసి
Eenadu6 Jul 2026
ఏఐని అతి’గా వాడి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్ ను హ్యాక్ చేసి

ఇంటర్నెట్ డెస్క్: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌తో ఓ వ్యక్తి ఏకంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌నే మోసం చేశాడు. ఎలాగైనా తనకే ఉద్యోగం దక్కాలన్న అత్యాశతో తోటి అభ్యర్థుల నుంచి పోటీ లేకుండా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఉన్న ఉద్యోగమూ పొగొట్టుకొని తాను తవ్విన గోతిలో తానే పడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? రాజస్థాన్‌ (Rajasthan) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్‌ కుమార్‌ మీనా బీటెక్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. 2024లో అక్కడి ప్రభుత్వం నిర్వహించిన అసిస్టెంట్‌ మైనింగ్‌ ఇంజినీర్ పరీక్ష రాశాడు. గతేడాది జులైలో ప్రొవిజనల్‌ లిస్టు విడుదలైంది. 24 పోస్టులకు 78 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. తమ కేటగిరీలో ఒక్క పోస్టుకు ఆరుగురు అభ్యర్థులు పోటీదారులుగా ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న రాహుల్‌ ఉద్యోగం రాదేమోనని ఆందోళనతో తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. లిస్టులో మొదటి స్థానానికి చేరాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం చాట్‌జీపీటీ, గ్రోక్‌, డీప్‌సీక్‌ వంటి ఏఐ టూల్స్‌ ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశాడు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోర్టల్‌లోకి వెళ్లి తనతో పోటీ పడుతున్న అభ్యర్థుల జాబితాను తొలగించాడు. సదురు అభ్యర్థులకు జాబితా నుంచి తొలగినట్లు సందేశం రావడంతో ప్రభుత్వ అధికారులను ఆశ్రయించారు. దీంతో సైబర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో నిందితుడు అధికారుల చేతికి చిక్కాడు. దీంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్నీ కోల్పోయాడు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఏఐన అత గ వ డ పబ ల క సర వ స కమ షన స ట న హ య క చ స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in