ఏఐ మెమరీచిప్స్ విస్తరణకు రూ. 1
Actor ProfileActor

ఏఐ మెమరీచిప్స్ విస్తరణకు రూ. 1

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏఐ మెమరీచిప్స్ విస్తరణకు రూ. 1,000 కోట్లు
Sakshi30 Jul 2026
ఏఐ మెమరీచిప్స్ విస్తరణకు రూ. 1,000 కోట్లు

న్యూఢిల్లీ: ఏఐ మెమరీ చిప్స్‌ తయారీ సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడంపై మైఫై దృష్టి పెడుతోంది. ఇందుకోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాలని, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ప్రస్తుతమున్న ప్లాంటును విస్తరించాలని యోచిస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, ఆటోమొబైల్‌ తదితర రంగాల నుంచి మెమరీ సొల్యూషన్స్‌కి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైఫై సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు వ్యాపార వృద్ధి, రూ.1,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మైక్రోమ్యాక్స్, తైవాన్‌కి చెందిన ఫైసన్‌ సంస్థ కలిసి జాయింట్‌ వెంచర్‌గా ఏర్పాటు చేసిన మైఫై గతేడాది జనవరిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాయి. దేశ విదేశీ కస్టమర్ల నుంచి భారీ ఆర్డర్ల దన్నుతో వచ్చే రెండు మూడేళ్లలో యూనికార్న్‌గా (1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌) ఎదిగే అవకాశం కూడా ఉందని శర్మ తెలిపారు. కేవలం హార్డ్‌వేర్‌కే పరిమితం కాకుండా కృత్రిమ మేధ (ఏఐ) సాఫ్ట్‌వేర్‌ విభాగంలోకి కూడా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. కృత్రిమ మేధ పనులకు సంబంధించి సిస్టమ్‌ మెమరీని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తమ ఏఐ అడాప్టివ్‌ మెమరీ సాఫ్ట్‌వేర్‌ సహాయకరంగా ఉంటుందని వివరించారు. గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు) మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు) శోభిత మాన్‌సూన్ లుక్.. గ్లామర్ మూమూలుగా లేదు! (ఫొటోలు) థాయ్‌ల్యాండ్ బీచ్ వెకేషన్‌లో సినిమా జంట (ఫొటోలు) కృష్ణ లంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఎక్కడ మేడం.. శిష్యుడి కోసం బుడ్డోడికి గంభీర్ వెన్నుపోటు సింగర్ చిన్మయి వ్యాఖ్యలపై సునీత రియాక్షన్