ఏఐ దెబ్బకు 12 వేల కోర్సులు ఔట్.. చదివిన డిగ్రీలు చెత్తబుట్టలోకి
Actor ProfileActor

ఏఐ దెబ్బకు 12 వేల కోర్సులు ఔట్.. చదివిన డిగ్రీలు చెత్తబుట్టలోకి

Total News1
Movie Updates0
Sources1
ఏఐ దెబ్బకు 12 వేల కోర్సులు ఔట్.. చదివిన డిగ్రీలు చెత్తబుట్టలోకి
Sakshi15 Jun 2026
ఏఐ దెబ్బకు 12 వేల కోర్సులు ఔట్.. చదివిన డిగ్రీలు చెత్తబుట్టలోకి

ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం దాదాపు ఖాయం అన్న భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక విప్లవ వేగం పెరగటంతో నిన్నటి నైపుణ్యాలు ఈ రోజు పనికిరాని స్థితికి చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమయ్యే సామర్థ్యాలు ఏమిటన్న దానిపై దేశాలు మళ్లీ ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ప్రపంచ ఉద్యోగ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ.. చైనా ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా... కాలం చెల్లినట్లు భావిస్తున్న వేలాది డిగ్రీ కోర్సులను విశ్వవిద్యాలయాలు తొలగిస్తున్నాయి. చైనా ఉన్నత విద్యా సంస్థలు తమ విద్యా కోర్సుల్లో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్నాయి. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత దగ్గరచేసే ప్రయత్నంలో భాగంగా వేల సంఖ్యలో కాలం చెల్లినట్లు భావిస్తున్న డిగ్రీలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సాంకేతికత ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. 10,200 కొత్త కోర్సులు పరిశ్రమల్లో ప్రపంచ నాయకత్వం సాధించాలనే లక్ష్యాన్ని చైనా పెట్టుకుంది. అలాగే, చైనాలో లక్షలాది యువతకు ఉపాధి దొరకడం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నంలో చైనా ఈ చర్యలు చేపడుతోంది. 2021 నుంచి 2025 మధ్య చైనా ఉన్నత విద్యా సంస్థలు 12,200 అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను రద్దు చేశాయి/నిలిపివేశాయి. అదే సమయంలో 10,200 కొత్త కోర్సులను ప్రారంభించాయి. దీంతో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ కోర్సుల్లో 30% కంటే ఎక్కువ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విభాగాల్లో కోర్సులు ఔట్‌ ఈ తొలగింపులు ప్రధానంగా కళలు, మానవీయ శాస్త్రాలు, విదేశీ భాషలు, నిర్వహణ విద్య విభాగాల్లో జరిగాయి. చైనాలో యువత విషయంలో నిరుద్యోగం 16% కి పైగా ఉండటం, ఉద్యోగ రంగం కృత్రిమ మేధ ప్రభావంతో వేగంగా మారిపోవటం వల్ల ఈ