
కింగ్ నాగార్జున కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం సంతోషం తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ మూవీ. ఈ సినిమాలో శ్రియాతో పాటు కథానాయికగా నటించింది అందాల భామ గ్రేసీ సింగ్. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అందచందాలతో, అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇక గ్రేసీ సింగ్ సంతోషం సినిమాలో కనిపించింది.. కొద్ది సమయం మాత్రమే అయినా, దేవుడే దిగివచ్చినా తాజ్‌మహల్ నాకిచ్చినా వంటి పాటలో ఆమె తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఆమె తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు గ్రేసీ సింగ్. ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా సంతోషం చిత్రం తర్వాత, ఆమె మరిన్ని తెలుగు సినిమాల్లో నటిస్తుందని అంతా భావించారు. అయితే అది జరగలేదు. ఆమె మోహన్‌బాబు, శ్రీకాంత్ హీరోలుగా వచ్చిన తప్పుచేసి పప్పుకూడు అనే చిత్రంలో నటించారు, ఇది ఆమెకు తెలుగులో చివరి చిత్రం. తెలుగు పరిశ్రమకు దూరమైనా, ఆమెకు హిందీతో పాటు తమిళం, మలయాళం, పంజాబీ వంటి ఇతర భాషల్లో సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్‌తో కలిసి లగాన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించారు. అలాగే గంగాజల్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి విజయవంతమైన సినిమాలలోనూ గ్రేసీ సింగ్ కీలక పాత్రలు పోషించి నటిగా తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత చాలా కాలానికి తెలుగులో రామ రామ కృష్ణ కృష్ణ అనే చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సరసన ఓ కీలక పాత్రలో కనిపించారు. ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్