ఎస్ బీఐ పీఎన్ బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక
Actor ProfilePolitician

ఎస్ బీఐ పీఎన్ బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎస్ బీఐ పీఎన్ బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక
Asianet News Telugu26 Aug 2026
ఎస్ బీఐ పీఎన్ బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక

సోషల్ మీడియాలో ఈ మధ్య ఏ వార్త నిజమో, ఏ వార్త అబద్ధమో తెలుసుకోవడం కష్టంగా మారింది. తాజాగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దేశంలోని మూడు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), కెనరా బ్యాంక్ (Canara Bank) లు ఒకే బ్యాంకుగా విలీనం కాబోతున్నాయనేది ఆ వార్త సారాంశం. ఈ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న కోట్లాది మంది కస్టమర్లు ఈ న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక పేపర్ క్లిప్పింగ్ లాంటి గ్రాఫిక్ ఇమేజ్ తెగ చక్కర్లు కొడుతోంది. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాసి ఉంది. ఈ మూడు బ్యాంకులు కలిసి దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించబోతున్నాయని, ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందంటూ ఆ ఇమేజ్‌లో పేర్కొన్నారు. ఒక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన రిపోర్ట్‌లా దీన్ని డిజైన్ చేయడంతో జనాలు ఇది నిజమే అని నమ్మి షేర్ చేయడం ప్రారంభించారు. ఈ వైరల్ న్యూస్ దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని నోడల్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) రంగంలోకి దిగింది. పీఐబీకి చెందిన ఫ్యాక్ట్ చెక్ వింగ్ ఈ వైరల్ క్లెయిమ్‌ను పూర్తిగా ఖండించింది. తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వైరల్ ఇమేజ్‌ను షేర్ చేస్తూ, దానిపై పెద్ద అక్షరాలతో ఫేక్ అని స్టాంప్ వేసింది. ఈ బ్యాంకుల విలీనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలను ఆమోదించలేదని స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ విషయంపై స్పందిస్తూ