
సిర్పూరు పేపర్ మిల్లులో వెంటనే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రేడ్ యూనియన్ నాయకులు చేస్తున్న రిలే దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. సిర్పూరు పేపర్ మిల్లు అనేది వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల జీవనాధరమని, మిల్లు అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం వాటి పరిష్కారంపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాగజ్‌నగర్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు పేపర్ మిల్లులో వెంటనే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రేడ్ యూనియన్ నాయకులు చేస్తున్న రిలే దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. సిర్పూరు పేపర్ మిల్లు అనేది వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల జీవనాధరమని, మిల్లు అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం వాటి పరిష్కారంపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎస్పీఎం మిల్లుపై గొంతెత్తిన ఎమ్మెల్యే హరీష్ బాబు ఇప్పుడు కార్మికుల ఆందోళనలు చేస్తున్నా ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు స్పందించటం లేదన్నారు. ఎమ్మెల్యేకు నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ది ఉంటే కార్మికశాఖతో, యాజమాన్యంతో మాట్లాడి ఎన్నికలు నిర్వహించేట్టు చూడాలని ఆయన కోరారు. ఈ నెల చివరి వారంలో లేబర్ కమిషనర్‌ను బీఆర్‌ఎస్ బృందంతో కలిసి కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు యూరియా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన యాప్‌ను వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన