ఎస్ ఐఆర్ .. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
Actor ProfilePolitician

ఎస్ ఐఆర్ .. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

Total News1
Movie Updates0
Sources1
ఎస్ ఐఆర్ .. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
Eenadu15 Jun 2026
ఎస్ ఐఆర్ .. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. వివిధ అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. అనుమానాస్పదం పేరుతో ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ‘‘ఓట్లు తొలగిస్తే రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. వచ్చే ఎన్నికలకు ఈ అక్టోబర్‌లోనే ఓటర్ల జాబితా ఖరారవుతుంది. ఓట్లు తొలగిపోతే తర్వాత చేసేదేం ఉండదు. ప్రతి గ్రామంలో బీఎల్‌వోలతో నాయకులు అనుసంధానమవ్వాలి. బీఎల్‌వోలు వెళ్లినప్పుడు వలస వెళ్లిన ఓట్లర్లు అందుబాటులో ఉండరు. అలాంటి ఓట్లు తొలగించకుండా జాగ్రత్త వహించాలి. ఈనెల 20లోపు ఇన్‌ఛార్జ్‌ మంత్రులు స్థానికంగా సమీక్షించాలి. జిల్లా స్థాయిలో మానిటరింగ్‌ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి. 17 ఎంపీ స్థానాల్లో ఎక్కడైనా సమస్య వస్తే పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌, అసెంబ్లీ పరిధిలో అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యత వహించాలి. గాంధీభవన్‌ వార్‌రూమ్‌ ద్వారా బూత్‌ లెవెల్‌ మానిటరింగ్‌ చేయాలి. ఏరోజుకు ఆరోజు నివేదికలు తెప్పించుకోవాలి. ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా నష్టం జరుగుతుంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అమ్మ ప్రేమను, అవకాయ రుచిని, హైదరాబాద్‌ నగరాన్ని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. పాఠశాలలకు తొలిరోజు వస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అల్పాహారం ఏర్పాటు చేశారు. ఉచిత