ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక అడుగు ముందే ఏపీ
Actor ProfilePolitician

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక అడుగు ముందే ఏపీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక అడుగు ముందే ఏపీ
Oneindia Telugu29 Aug 2026
ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక అడుగు ముందే ఏపీ

భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవీల తయారీలో హీరో మోటార్స్ సంస్థ పెద్ద ఎత్తున దృష్టి సారించాలని సూచించారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెం వద్ద హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 కు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. హీరో మోటార్స్ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ పారిశ్రామిక వేత్తగా జాతి నిర్మాణానికి సహకరించిన గొప్ప వ్యక్తి. హీరో మోటార్స్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకుంటే వారితో ప్రత్యేకంగా చర్చించి ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పించాం. 2018లో తిరుపతిలో శంకుస్థాపన చేసిన హీరో మోటార్స్ ప్లాంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వాహనాలను ఉత్పత్తి చేస్తోంది.ఇప్పుడు విడా పేరుతో ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉంది. హీరో సంస్థకు ఉన్న అన్ని ఉత్పత్తి కేంద్రాల కంటే ఇక్కడి యూనిట్ ను ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలి. ప్లాంట్ ఏర్పాటులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకరిస్తుంది. వేగంగా ప్రాజెక్టు యూనిట్ ను పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలి. హీరో సంస్థ ప్రకటించిన మేరకు రూ.3,200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్ విస్తరణ పనులు ప్రారంభించాలని కోరుతున్నాను.భవిష్యత్ అంతా ఈవీలదే. డిమాండ్ కు తగినట్టుగా ఈవీల ఉత్పత్తికి హీరో సంస్థ సిద్దంగా కావాలి. ఇవాళ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 శంకుస్థాపన చేయటం సంతోషంగా ఉంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. ఇప్పటికే 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఒక అడుగు ముందే ఉంది. హీరో సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో 40 శాతం మంది మహిళలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళలు