ఎయిర్ పోర్ట్ లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా
Actor ProfileActor

ఎయిర్ పోర్ట్ లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా

Total News1
Movie Updates0
Sources1
ఎయిర్ పోర్ట్ లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా
Chitrajyothy14 Jun 2026
ఎయిర్ పోర్ట్ లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా

హీరో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యానని అన్నారు మాస్ డైరెక్టర్ వివి వినాయక్. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై.. వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ చిత్ర వేడుకకు వినాయక్ అతిథిగా హాజరయ్యారు. హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) పరపతి చూసి షాకయ్యానని అన్నారు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ (VV Vinayak). వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై.. వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu). కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్న ఈ చిత్రంలో రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. జూన్ 19న విడుదల సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్ మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. ‘‘వడ్డే నవీన్ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు థాంక్స్. నేను ఆయన చిత్రానికి అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పని చేస్తున్న టైమ్‌లోనే ఎన్టీఆర్ ‘ఆది’ సినిమాకు డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. ఆయన సినిమాకే స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు అక్కడ ఎన్టీఆర్‌తో పరిచయమైంది. ‘ఆది’ సినిమాకు నాంది వడ్డే నవీన్ సినిమా. ఆయన నన్ను ఎంతో ఇష్టంగా చూసుకునేవారు. ఆయన కెరీర్‌లోని 90 శాతం సినిమాలు మనస్పూర్తిగా, ఇష్టంతో చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు. సినిమాల పట్ల ఆయనెప్పుడూ తృప్తిగా ఉండరు. ఒకసారి నేనో సీన్ రాస్తే.. ఆ సీన్ ఆయనకు నచ్చి నన్ను భోజనానికి పిలిచారు. వినయ్, నువ్వు చాలా మంచి డైరెక్టర్‌వి అవుతావు.. ఇక అసిస్టెంట్