
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా షూట్ లో బిజీగా ఉండి కాస్త ఆలస్యంగా పెద్ది సినిమా చూశారు. స్పోర్ట్స్ కథాంశంతో ఎమోషనల్ గా తెరకెక్కిన పెద్ది సినిమా ఇప్పటికే 370 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పెద్ది సినిమా చూసిన చిరంజీవి తాజాగా బుచ్చిబాబుని పిలిచి సినిమా గురించి, చరణ్ గురించి మాట్లాడారు. చిరంజీవి పెద్ది గురించి మాట్లాడుతూ.. నేను షూటింగ్ లో బిజీగా ఉండి లేట్ గా చూసాను. ఇది సినిమా కాదు ఒక జీవితంలో డౌన్ ఫాలో లో ఉన్నవాళ్లకు వాళ్ళ జర్నీలా చూపించావు. ఇది చూసాక కోలుకోవడానికి టైం పట్టింది. నిద్రలో కూడా అవే విజువల్స్ వచ్చాయి. అంత డీప్ ఇంపాక్ట్ ఇచ్చావు. ఆ కథ నిజాయితీ, ఇంటెన్సిటీ, దాన్ని చూపించిన విధానం బాగుంది. ఒక ఊరి సమస్య అయినా నేషనల్ లెవల్ లో చూపించావు ఆ కథని. స్పోర్ట్స్ పర్సన్స్ ని గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేయాలని మంచి పాయింట్ చెప్పావు. మంచి సోషల్ మెసేజ్ ఇచ్చావు. అప్పలసూరి మరణం నుంచి సినిమా హై లెవెల్ కి వెళ్ళింది అని చెప్తూ మూవీకి పనిచేసిన అందర్నీ పేర్లు చెప్తూ వాళ్ళ వర్క్ గురించి మాట్లాడుతూ అభినందించారు. ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టాడని తెలిసిందే. ప్రేక్షకులను చరణ్ తన నటనతో ఏడిపించాడు. పెద్దిలో చరణ్ పర్ఫార్మెన్స్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా చూసి చరణ్ బాగా నటించాడని వాళ్ళ అమ్మ అంటుంది. బాగా నటించాడు అనేది కరెక్ట్ కాదు జీవించాడు అనాలి అని చెప్పాను. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్టర్ గా నాకు తెలుసు అవతలి నటుడు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలికిస్తూ ప్రేక్షకులను ఏడిపిస్తే జీవించేసాడు అనాలి. చరణ్ అలా జీవించేసాడు. వాడు నా బిడ్డ కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్తాను. తండ్రి గా