ఎమ్మెల్యేల చేతుల్లోకి అసైన్డ్ భూములు
Actor ProfilePolitician

ఎమ్మెల్యేల చేతుల్లోకి అసైన్డ్ భూములు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎమ్మెల్యేల చేతుల్లోకి అసైన్డ్ భూములు
Sakshi8 Jul 2026
ఎమ్మెల్యేల చేతుల్లోకి అసైన్డ్ భూములు

సాక్షి,విజయవాడ: కేబినెట్ సమావేశంలో కూటమి సర్కార్‌ రాష్ట్ర పరిపాలన, ప్రజా సేవలు, విద్యా రంగం, వైద్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపేలా నిర్ణయాలు తీసుకుంది. వాటిల్లో ప్రధానంగా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ఆధ్వర్యంలోని అసైన్డ్‌ కమిటీలు రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇకపై నియోజకవర్గంలో అసైన్డ్‌ భూములపై నిర్ణయాధికారాన్ని ఎమ్మెల్యేల కమిటీలకు అప్పగించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలను కమిటీ ఛైర్మన్‌లుగా నియమించనున్నారు. దీంతో అసైన్డ్‌ భూములపై తుది నిర్ణయాలు కూటమి ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఈ నిర్ణయం రాజకీయ ప్రభావం, పారదర్శకతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. గీతం యూనివర్సిటీలో 45 మీటర్ల ఎత్తు వరకు స్కూల్ భవన నిర్మాణానికి ఫైర్ ఎన్‌ఓసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని నిబంధన విధించింది. ఈ నిర్ణయం విద్యా రంగంలో అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నప్పటికీ, భద్రతా ప్రమాణాల అమలు కఠినంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌లో బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్‌కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆస్పత్రులు తీసుకునే రుణాలపై వడ్డీ భారాన్ని ఆస్పత్రులే భరించాలని నిర్ణయించింది. 8 శాతం వడ్డీని ఆస్పత్రులే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ఆస్పత్రులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని, దీని ప్రభావం రోగులపై పడవచ్చని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రాండ్‌గా బోనీ కపూర్ కూతురి పెళ్లి వేడుకలు ప్రారంభం (ఫొటోలు) లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు) నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు) హైదరాబాద్‌ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు) బంగారం కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి రోడ్డుపై కాన్వాయ్ ఆపి.. మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్ సిట్ ప్రశ్నలకు CI నాగరాజు షాకింగ్ సమాధానాలు