ఎఫ్ సీఆర్ఏ సవరణలు జాతీయ భద్రతకు అవసరమే.. కానీ
Actor ProfilePolitician

ఎఫ్ సీఆర్ఏ సవరణలు జాతీయ భద్రతకు అవసరమే.. కానీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎఫ్ సీఆర్ఏ సవరణలు జాతీయ భద్రతకు అవసరమే.. కానీ
TeluguOne18 Jun 2026
ఎఫ్ సీఆర్ఏ సవరణలు జాతీయ భద్రతకు అవసరమే.. కానీ

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ)లో సవరణలు భారతదేశంలో పౌర సమాజ స్వేచ్ఛ, జాతీయ భద్రత మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. విదేశీ నిధుల నెట్‌వర్క్‌ల ద్వారా దేశీయ వ్యవహారాల్లో జోక్యాన్ని నిరోధించడం లక్ష్యంగా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇది పౌర హక్కులను పరిమితం చేస్తుందంటూ అమెరికా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా, లేదా లైసెన్స్ రద్దయిన స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓ) విదేశీ నిధులతో కూడిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా నిబంధనలు కఠినతరం చేశారు. విదేశీ నిధులు పొందే సంస్థలు నిర్దేశిత శాఖల ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాలని కేంద్రం నిర్దేశించింది. ప్రభుత్వం ఈ నిధులను దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు ముప్పుగా భావిస్తూ నిఘాను పెంచింది. అమెరికన్ నెట్‌వర్క్‌ ది టిత్ ఇనిషియేటివ్ లాంటి కొన్ని అంతర్జాతీయ ఫెయిత్-బేస్డ్ సంస్థలు మత మార్పిడులు, రాజకీయ కార్యకలాపాలకు నిధులు మళ్లిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నెట్‌వర్క్‌లపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అమెరికాకు చెందిన చట్టసభ్యులు డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల చట్ట సభ సభ్యులు ఈ సవరణలపై ఆందోళన వ్యక్తం చేశారు. కఠినమైన చట్టాలు, ఆస్తుల స్వాధీనం లాంటి అంశాలు భారతదేశంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న విద్యా, వైద్య, మానవతా సహాయ సంస్థల మనుగడను దెబ్బతీస్తాయని వాదిస్తున్నారు. విదేశీ నిధుల పేరుతో వచ్చే అపరిమిత నిధులు దేశ అంతర్గత భద్రతను, పబ్లిక్ ఆర్డర్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున కఠిన నిబంధనలు అవసరమని మన కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నది. మరోవైపు విపరీతమైన అధికార కేంద్రీకరణ, ఆస్తుల జప్తు హక్కులు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తాయని పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి భారత్‌లో ఎఫ్‌సీఆర్ఏ చట్టం చుట్టూ జరుగుతున్న తాజా పరిణామాలు, కర్ణాటకలో యూఏపీఏ కింద నమోదైన కేసులు, బస్తర్, ఛత్తీస్గఢ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విదేశీ నిధుల వినియోగంపై