
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సినిమా ప్రముఖుల రాజకీయ ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశం చేసే అవకాశాలు గురించి ఊహాగానాలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక ఏఐ-జనరేటెడ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయి పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దారితీసింది. ఈ ఉదంతం ఇప్పుడు తమిళ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి ప్రధాన కారణం రాఘవ లారెన్స్‌కు సంబంధించిన ఒక ఫ్యాన్ పేజీలో షేర్ చేయబడిన ఏఐ ఇమేజ్. ఆ చిత్రంలో లారెన్స్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ ఎదుట కూర్చుని ఉన్నట్లు చూపించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. లారెన్స్ ఇంకా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ పార్టీలో అధికారికంగా చేరకుండానే ఇలాంటి చిత్రాలు పోస్ట్ చేయడం అత్యాశగా ఉందంటూ నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు కొందరు లారెన్స్ అభిమానులు ఈ వివాదంపై స్పందిస్తూ ఆయనను సమర్థించే ప్రయత్నం చేశారు. ఈ వివాదాస్పద చిత్రం లారెన్స్ అధికారిక ఖాతా నుంచి కాకుండా ఫ్యాన్ పేజీ నుంచి వచ్చినట్లు వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా లారెన్స్ సామాజిక సేవా కార్యక్రమాలు, పాఠశాలలు మరియు ఆశ్రయాల నిర్మాణం ద్వారా ప్రజల్లో ఇప్పటికే మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దళపతి విజయ్‌తో ఉన్న దీర్ఘకాలిక స్నేహం కారణంగా టీవీకే పార్టీలో లారెన్స్‌కు మంచి అవకాశాలు వచ్చే వీలుంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో లారెన్స్ పోటీపై బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి గెలిచి, తర్వాత రాజీనామా చేసి పెరంబూర్‌ను ఎంచుకోవడంతో తిరుచ్చి ఈస్ట్‌కు బై-ఎన్నికలు జరగనున్నాయి. లారెన్స్ ఈ ఖాళీ సీటు నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే