
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana BJP: అన్ని ఉన్న అల్లుడి నోట్ల.. డాష్.. డాష్ అన్నట్టుగా ఉంది తెలంగాణలో బీజేపీ పరిస్థితి. ఇక్కడ నాయకులకు కొదవ లేదు. కానీ అందరు ఒక్కతాటిపై నిలబడిన సందర్భాలు లేవు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతుంది పరిస్థితి. తెలంగాణ బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు ఢిల్లీ వేదికగా చాడీలు గట్రా చెప్పుకుంటూ ఇక్కడ పార్టీని ఎదగకుండా చేస్తున్నారనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ రోజు రాష్ట్రానికి బీజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రానున్నారు.అంతేకాదు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇక్కడి రాష్ట్ర నేతలకు రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఫోకస్ చేసినట్టు బీజేపీ చేయలేకపోతుందనే టాక్ ప్రజల్లో ఉంది. ఇక నితీన్ నబీన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నాలుగు గంటలకు రంగారెడ్డి రూరల్‌లో కొత్తగా నిర్మించిన తొమ్మిది బీజేపీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. అంతేకాదు తెలంగాణలో బీజెపీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అధికార పీఠం కైవసం చేసుకునే దిశగా కార్యకర్తలను సమాయత్తం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఈ టూర్లో నితిన్ నబీన్ పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో బిజెపి జాతీయ