
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతులను, రాజ్యాంగ వ్యవస్థలను కూటమి పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలో 'రూల్ ఆఫ్ లా' కాకుండా 'రూల్ ఆఫ్ ఫియర్' నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే అణచివేసే ధోరణి సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా క్షీణించిందని, సాధారణ ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా మారాయని, 'జంగిల్ రాజ్'ను తలపిస్తోన్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు రూపంలో రియల్ లైఫ్ విలన్ కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ సీనియర్ ఎన్టీఆర్ బతికి ఉండి చంద్రబాబును ప్రశ్నించినా, ఆయనపై కూడా రౌడీషీటర్ అని ముద్ర వేసేవారంటూ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. హే రామ్.. సేవ్ ఏపీ అనే నినాదంతో అందరి నోళ్లల్లో నానుతోందని పేర్కొన్నారు. టీడీపీకి సంబంధించిన ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లను కుట్రపూరితంగా తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండానే పనులు పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశిస్తున్నారని ధ్వజమెత్తారు. అర్హుల ఓట్లను తొలగిస్తే వారికి సంక్షేమ పథకాలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. ఓట్లను తొలగిస్తూ చివరికి స్థానిక ప్రజలకు కనీస పౌరసత్వం లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వివాదాన్ని ప్రస్తావిస్తూ జగన్ పోలీసుల