ఎడతెగని లాభాల్లో బంగారం
Actor ProfilePolitician

ఎడతెగని లాభాల్లో బంగారం

Total News1
Movie Updates0
Sources1
ఎడతెగని లాభాల్లో బంగారం, వెండి. రాకెట్ లా దూసుకెళ్తున్న ధరలు
Oneindia Telugu15 Jun 2026
ఎడతెగని లాభాల్లో బంగారం, వెండి. రాకెట్ లా దూసుకెళ్తున్న ధరలు

గత వారం రోజులుగా పసిడి పతనంతో ఆందోళన చెందిన దేశీయ బంగారం ప్రియులకు, పెట్టుబడిదారులకు సోమవారం నాడు ఊహించని శుభవార్త అందింది. అంతర్జాతీయ విపణిలో చోటుచేసుకున్న చారిత్రాత్మక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మెరుపు వేగంతో పుంజుకున్నాయి. దేశీయ లబ్ధితో పాటు గ్లోబల్ మార్కెట్లలోనూ లోహాల ధరలు రాకెట్‌లా దూసుకెళ్లడంతో ట్రేడర్లలో మళ్లీ కొత్త ఉత్సాహం నెలకొంది. దీర్ఘకాలంగా నష్టాల్లో ఉన్న బులియన్ మార్కెట్ ఒకే రోజు భారీ లాభాలను సాధించి మునుపటి నష్టాలన్నింటినీ పూర్తిగా తుడిచేసింది.మార్కెట్లు ఈ స్థాయిలో అకస్మాత్తుగా పుంజుకోవడానికి అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ప్రణాళికే ప్రధాన కారణం. ఇరు దేశాల మధ్య ఘర్షణలకు తాత్కాలిక ముగింపు పలకడం, టెహ్రాన్‌పై వాషింగ్టన్ విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడం, అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటివి ఈ చారిత్రక ఒప్పందంలో భాగమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా.. ఇరాన్‌తో ఒప్పందం విజయవంతంగా పూర్తయిందని, అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగిస్తున్నట్లు ధృవీకరించడంతో మార్కెట్లకు భారీ ఊపు వచ్చింది.దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ఊపుదేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్-MCX) ఆగస్టు డెలివరీకి సంబంధించిన బంగారం ఒప్పందాలు ఏకంగా రూ. 2,242 ఎగబాకి, పది గ్రాములకు రూ. 1,52,770 రికార్డు స్థాయికి చేరాయి. ఈ ట్రేడింగ్‌లో సుమారు 8,948 లాట్ల భారీ వ్యాపార టర్నోవర్ నమోదు కాగా, పసిడి కాంట్రాక్టులు 1.49 శాతం గరిష్ట వృద్ధిని చాటాయి. గత వారంలో రూ. 5,066 (సుమారు 3.2 శాతం) వరకు పతనమై రూ. 1.50 లక్షల వద్ద స్థిరపడిన పసిడి, ఇప్పుడు ఆ నష్టాలన్నింటినీ అధిగమించింది.స్వర్ణ నిధితో బయటపడిన 500 ఏళ్ల నాటి బోమ్ జీసస్’ నౌక.. మరోవైపు అంతర్జాతీయ వేదికపై న్యూయార్క్ కామెక్స్ (Comex) మార్కెట్లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా