
ఇంటర్నెట్ డెస్క్: విజయవంతమైన ‘సర్దార్’ సినిమాకి కొనసాగింపుగా కథానాయకుడు కార్తి.. దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబోలో రూపొందిన చిత్రం ‘సర్దార్ 2’ (Sardar 2). ఎన్నో నెలలుగా ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ విడుదల తేదీని టీమ్ ప్రకటించింది. సెప్టెంబర్ 10న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. గతేడాది జూన్‌లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి భాగం హిట్ కావడంతో ‘సర్దార్ 2’పై అంచనాలు నెలకొన్నాయి. కార్తికి జోడీగా మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కనిపించనున్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య ‘బ్లాక్ డాగర్’ పాత్రలో పవర్‌ఫుల్ విలన్‌గా నటించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు