ఎట్ట కేల కు.. విజయ్ 'జన నాయగ న్' సెన్సార్ పూర్తి
Actor ProfileActor

ఎట్ట కేల కు.. విజయ్ 'జన నాయగ న్' సెన్సార్ పూర్తి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎట్ట కేల కు.. విజయ్ 'జన నాయగ న్' సెన్సార్ పూర్తి
Chitrajyothy1 Sept 2026
ఎట్ట కేల కు.. విజయ్ 'జన నాయగ న్' సెన్సార్ పూర్తి

తమిళ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయకన్'విడుదలపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళ స్టార్ విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం 'జన నాయకన్' (Jana Nayagan) విడుదలపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికే విడుద‌ల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ స‌మ‌స్య‌ల్లో చిక్కుకుని నేటికి విడుద‌లకు నోచుకోలేదు. ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాట ఎన్నిక‌లు పూర్త‌వ‌డం, విజ‌య్ అధికారంలోకి రావ‌డం అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి కూడా. ఆపై విజ‌య్ ప్ర‌భుత్వం వ‌చ్చాక జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల వ్య‌వ‌హారం మ‌ర‌లా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ఇప్పుడు రిలీజ్ అప్పుడు రిలీజ్ అంటూ వార్త‌లు కూడా వైర‌ల్ అయ్యాయి కానీ ఎలాంటి ఎలాంటి ముంద‌డుగు లేదు. అఖ‌రికి అ సినిమా నిర్మాత వెంక‌ట్ నారాయ‌ణ ఢిల్లీలో త‌మిళ‌నాడు అధికార ప్ర‌తినిధిగా కూడా నియ‌మించ బ‌డ్డాడు. అయితే.. తాజాగా త‌మిళ మీడియా కథనాల ప్రకారం జన నాయగ‌న్ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ Central Board of Film Certification (CBFC) నుంచి 'A' సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం. దీంతో విడుదలకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయితే ఈ నెలలోనే సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే సినిమా సెన్సార్ స‌ర్టిఫికెట్‌, విడుద‌ల తేదీపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 'జన నాయకన్' విజయ్ సినీ కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన చిత్రం. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన తర్వాత ఆయన నటిస్తున్న చివరి సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సెన్సార్ వివాదం ముగిసినట్లు వస్తున్న వార్తలతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. హెచ్. వినోద్‌ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిచింది. బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్