ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఏంటో ప్రముఖ ఫ్రాన్సిస్ ఇనిస్టిట్యూట్ పరిశోధనలు తెలిపాయి. ఆ వివరాలు తెలుసుకుందాం. ఊపిరితిత్తుల పనితీరు మందగించడం వల్ల దగ్గు ఎక్కువగా వస్తుంటుంది. అలాగే దగ్గినపుడు సౌండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దగ్గు ఎంతకూ తగ్గకపోతే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఛాతి బిగుసుకుపోయినట్లుగా ఉండటం వల్ల శ్వాస తీసుకోలేరు. ఇలాంటి లక్షణం కనిపించినా జాగ్రత్త పడాలి. దగ్గినపుడు కఫంతో పాటు రక్తం పడితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం. కచ్చితంగా డాక్టర్‌ను కలిసి టెస్ట్‌లు చేయించుకోవాలి. క్యాన్సర్ కణాల ప్రభావం వల్ల ఆకలి తగ్గిపోతుంది. దీంతో ఆకస్మాత్తుగా బరువు తగ్గుతారు. ఇలా ఏ కారణం లేకుండా బరువు తగ్గింతే జాగ్రత్తపడటం మంచిది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే మాట్లాడినపుడు శబ్ధాలు మారిపోతాయి. మీ గొంతు బొంగురుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలం ఈ సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఛాతితో పాటు వెన్నెముక, భుజాల ప్రాంతంలో తీవ్రమైన నొప్పిగా ఉంటుంది. దగ్గినా, నవ్వినా, లోతుగా శ్వాస తీసుకున్నా ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సంకేతం కనిపిస్తే కూడా జాగ్రత్తపడాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా జరగదు. దీంతో నీరసంగా ఉంటుంది. చిన్న పని చేసినా అలసిపోతారు. శ్వాస తీసుకునే సమయంలో సన్నటి కూత పెట్టినట్లుగా సౌండ్ వస్తుంది. ఆస్తమా లేకుండా ఇలాంటి సౌండ్ ఉంటే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ ముందస్తు సంకేతమని గుర్తించాలి
Actor ProfilePolitician
ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేముందు కనిపించే సంకేతాలు
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•14 Jun 2026
ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేముందు కనిపించే సంకేతాలు