ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ 14 స్థానాలకు 14 గెలుస్తుంది
Actor ProfilePolitician

ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ 14 స్థానాలకు 14 గెలుస్తుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ 14 స్థానాలకు 14 గెలుస్తుంది
Namasthe Telangana1 Jul 2026
ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ 14 స్థానాలకు 14 గెలుస్తుంది

Harish Rao | రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, మోసగాడు. నల్లమల పేరు చెప్పి నల్లమల గౌరవం రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నాడు. ఇప్పటి వరకు 29 వేల 350 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీ పడ్డాడు. ఈ ప్రభుత్వంలో బోనస్ కాస్తా బోగస్ అయిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ హరీశ్‌ రావు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొలకెత్తిన గింజలు కొనలేని రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ను మొలకెత్తనియ్య అని అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు, సోయాబీన్, పల్లి , సన్ ప్లవర్ కొంతమేరే కొంటుంది. కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటుంది. ఖరీఫ్ సీజన్ లో వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఉమ్మడి పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లు గెలిచి కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాం. దళారుల, మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ, ఆయన ఎవరి తోలు తియ్యలే. రాష్ట్రం సాధించిన పార్టీగా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలతో చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా రాదంటున్న రేవంత్ రెడ్డి, పాలక పక్షం అవుతుందని ఒప్పుకున్నాడు. 100 స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని, అయన మోసాలను ఎండగడుతూనే ఉండాలి. పేరుకే BC,SC,ST కార్పొరేషన్లు, ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల వారికి కేసీఆర్ న్యాయం చేశారు. లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే పైసలు లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు కూతవేటు దూరంలో 100 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. గెస్ట్ హౌస్ చుట్టూ 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు