
ఉపాసన కొణిదెల మల్టీ టాలెంటెడ్. ఆమె వ్యాపారవేత్తగా ఉంది. స్పెషల్ వంటకాల రెసిపీ చేస్తూ పాపులర్ అయ్యింది. అదే సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. దీంతోపాటు మెగా ఫ్యామిలీలో కొడలిగా, పిల్లలకు తల్లిగా తాను అన్ని విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంది. మంచి ఇల్లాలుగా రాణిస్తోంది. ఉపాసన స్పెషల్ వంటకాలకు కేరాఫ్ అడ్రస్ అట. అత్తమ్మ పేరుతో రెసిపీలు చేసి పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఉపాసన చేసే వెరైటీ వంటలకు సుస్మిత పిల్లలు ఫిదా అవుతారట. లొట్టలేసుకొని తింటారని తెలిపింది సుస్మిత. చంద్రవ్వతో ఇంటర్వ్యూలో ఆమె ముచ్చటించింది. ఇందులో ఉపాసన ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఉపాసనకి వంటలు ఏమైనా వస్తాయా? ఆమె చేస్తుందా? అని అడిగింది చంద్రవ్వ. దీనికి సుస్మిత రియాక్ట్ అవుతూ, ఉపాసన ఆమె స్టయిల్‌లో వెరైటీ వంటకాలు చేస్తుందని చెప్పింది. ఆ వంటలు మా పిల్లలకు బాగా ఇష్టం, లొట్టలేసుకొని తింటారు` అని చెప్పింది సుస్మిత. కాకపోతే ఆమె కాస్త విచిత్రంగా స్పందించడం ఆశ్చర్యంగా మారింది. ఇది మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రమోషన్స్ టైమ్‌లో తెలిపింది. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పింది సుస్మిత. మీది చాలా పెద్ద ఫ్యామిలీ అందరు కలిసే ఉంటారా? విడిగా ఉంటారా? అని అడిగింది. దీనికి సుస్మిత స్పందిస్తూ, తాము, పిల్లలు వేరుగా ఉంటామని, కానీ సండేగానీ, పండుగలకుగానీ అంతా కలుస్తామని చెప్పింది. తాము తరచూ కలుస్తూనే ఉంటామని, కలిసినప్పుడు సెలబ్రేషన్‌లాగా ఉంటుందని చెప్పింది సుస్మిత. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి. సుస్మిత కొణిదెల నిర్మాతగా చిరంజీవి హీరోగా `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. సాహు గారపాటితో కలిసి ఆమె ఈ మూవీని నిర్మించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ క్లైమాక్స్ లో గెస్ట్ గా మెరిశారు. సినిమాకి హైలైట్ గా నిలిచారు. సంక్రాంతికి విడుదలైన ఈ