
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. VB-G RAM G Wage Rates Increased: ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)' - (VB-G RAM G) చట్టం-2025 కింద సవరించిన నూతన వేతనాల రేట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ పెరిగిన జీతాలు నేటి (జూలై 1, 2026) నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఇక నుంచి ఏ రాష్ట్రంలోనూ రోజువారీ కనీస కూలి రూ.300 కంటే తక్కువ ఉండకూడదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద సగటున రోజుకు రూ.298.8 ఉన్న వేతనాన్ని. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం రూ.327.4 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే రోజువారీ కూలీపై సగటున రూ.28.6 పెరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే వేతనాలలో దాదాపు 10 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. గ్రామీణ కార్మికుల ఆర్థిక సాధికారతకు బాటలు.. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి ఫలాలు ప్రతి పేద కుటుంబానికి అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ చట్టం ద్వారా ఉపాధి హామీ రోజులను 125 రోజులకు పెంచడమే కాకుండా, కూలీల వేతనాలను కూడా భారీగా పెంచామని చెప్పారు. ముఖ్యంగా గతంలో తక్కువ కూలీ ఉన్న రాష్ట్రాలకు ఈసారి అత్యధిక ప్రాధాన్యతనిచ్చామని.. దీనివల్ల గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతం