ఉపాధ్యాయులంటే వైకాపాకు ద్వేషం
Actor ProfilePolitician

ఉపాధ్యాయులంటే వైకాపాకు ద్వేషం

Total News1
Movie Updates0
Sources1
ఉపాధ్యాయులంటే వైకాపాకు ద్వేషం
Eenadu16 Jun 2026
ఉపాధ్యాయులంటే వైకాపాకు ద్వేషం

కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారిపై నిందలు వేస్తున్నారు ఉమ్మడి గోదావరి జిల్లాల మెగా డీఎస్సీ టీచర్ల సమావేశంలో నేతల ధ్వజం సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. వేదికపై ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు ఈనాడు, కాకినాడ: భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులంటే వైకాపాకు ఎప్పుడూ ద్వేషమేనని, వారి హయాంలో ఒక్క పోస్టునూ భర్తీ చేయలేకపోయారని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసి, నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపితే.. వారిపై లేనిపోని నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టించిన విషయాన్ని గురువులు మర్చిపోరన్నారు. కాకినాడలో సోమవారం ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు’ పేరిట చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి మెగా డీఎస్సీ ద్వారా ఎంపికై.. విధులు నిర్వర్తిస్తున్న నూతన ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగ యువత, ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు. డీఎస్సీ నియామకాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మీ సెల్‌ఫోన్‌ ద్వారానే ఖండించాలని ఎమ్మెల్యే కోరగా.. అంతా సెల్‌ఫోన్‌ లైట్లు ఆన్‌ చేసి ప్రభుత్వానికి మద్దతు పలికారు. డీఎస్సీ నియామకాల్లో తేడాలు జరిగినట్లు భావిస్తే ఆధారాలతో రావాలని విద్యా శాఖ కార్యదర్శి ఛాలెంజ్‌ చేస్తే.. వైకాపా నాయకులు ఎందుకు వెళ్లడం లేదని ఎమ్మెల్సీ రాజశేఖరం ప్రశ్నించారు. డీఎస్సీ అంటేనే తెదేపా ప్రభుత్వం గుర్తుకొస్తుందని.. నియామకాలు, బదిలీల్లోనూ పారదర్శకత పాటిస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు వెల్లడించారు. రిజర్వేషన్లపై అవగాహన లేనివారే ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వంలో సిఫార్సు బదిలీల పేరిట 300 మంది నుంచి వసూళ్లకు పాల్పడ్డారని నోబెల్‌ టీచర్ల సంఘం అధ్యక్షుడు సూరిబాబు ఆరోపించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు