
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. DA July Hike 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు.. ప్రభుత్వం నుండి రెండు కీలక ప్రకటనల కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటిది 7వ వేతన సంఘం పరిధిలో జరగనున్న కరువు భత్యం (DA)సవరణ కాగా, రెండోది ఇంకా సంప్రదింపుల దశలోనే ఉన్న 8వ వేతన సంఘానికి అమలుపై క్లారిటీ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు జూలై నెల సమీపిస్తుండటంతో.. ప్రభుత్వం త్వరలోనే తదుపరి డీఏ పెంపును ప్రకటించవచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో, దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘం కింద జీతాల సవరణపై చర్చలు కొనసాగుతున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటు అయినప్పటికీ, దాని సిఫార్సులు ఇంకా అమలులోకి రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారమే డీఏ సవరణలను పొందుతూ ఉంటారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల ప్రభావాన్ని తట్టుకోవడంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సహాయపడేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో డీఏను సమీక్షిస్తుంది. తుది ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రభుత్వ లెక్కల ఆధారంగా.. జూలై 2026లో జరగబోయే డీఏ సవరణలో 2-3% పెంపు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. డీఏను ఎలా లెక్కిస్తారు? గత 12 నెలల్లో నమోదైన సగటు ద్రవ్యోల్బణం ఆధారంగా కరువు భత్యం సవరిస్తారు. ఈ గణన 'వినియోగదారుల ధరల సూచీ' (CPI)తో ముడిపడి ఉంటుంది. ఇది వస్తువులు, సేవల ధరలలో వచ్చే మార్పులను కొలుస్తుంది. 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఇంకా ఖరారు