ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జీతాలు 50 పెరిగే ఛాన్స్
Actor ProfilePolitician

ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జీతాలు 50 పెరిగే ఛాన్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జీతాలు 50 పెరిగే ఛాన్స్
Asianet News Telugu26 Aug 2026
ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జీతాలు 50 పెరిగే ఛాన్స్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం సిఫార్సులపై ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు అందరూ కేవలం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గురించే మాట్లాడుకున్నారు. కానీ, ఇప్పుడు జీతాల సవరణను శాసించే మరో ముఖ్యమైన విషయం తెరపైకి వచ్చింది. అదే ఫ్యామిలీ యూనిట్. కనీస వేతనాన్ని నిర్ణయించడానికి ఈ ఫ్యామిలీ యూనిట్ లెక్కింపు చాలా కీలకం. ఈ లెక్కింపులో మార్పులు వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘానికి సంబంధించిన అప్‌డేట్లను క్రమంగా పంచుకునే ఒక ఎక్స్ ఖాతా దీనిపై ఆసక్తికరమైన లెక్కలను వెల్లడించింది. 7వ వేతన సంఘం కనీస వేతనాన్ని లెక్కించే సమయంలో ఫ్యామిలీ యూనిట్‌ను 3.0 గా తీసుకుంది. దానికి బదులుగా 4.6 గా తీసుకుని ఉంటే, కనీస ప్రాథమిక వేతనం రూ. 18,000 కు బదులుగా ఏకంగా రూ. 27,600 గా ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.94 గా మారేది. 7వ వేతన సంఘం అమలు చేసిన 2.57 తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ మార్పు గనుక జరిగి ఉంటే ఉద్యోగుల జీతాలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగి ఉండేవని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 7వ వేతన సంఘం కాలంలో ఫ్యామిలీ యూనిట్‌ను ప్రభుత్వ ఉద్యోగి (1.0), జీవిత భాగస్వామి (0.8), ఇద్దరు పిల్లలు (ఒక్కొక్కరు 0.6 చొప్పున 1.2) మొత్తంగా 3.0 గా లెక్కించారు. అయితే, ఇందులో ఉద్యోగిపై ఆధారపడి జీవించే వృద్ధాప్య తల్లిదండ్రులను లెక్కలోకి తీసుకోలేదు. ప్రస్తుత రోజుల్లో కుటుంబ బాధ్యతలు, ఖర్చులు పెరిగాయి కాబట్టి, 8వ వేతన సంఘం ఈ ఫ్యామిలీ యూనిట్‌ను 4.6 నుండి 5.0 కి పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ స్టాఫ్ సైడ్ కూడా తమ మెమోరాండంలో ఈ ఫ్యామిలీ యూనిట్ కౌంట్‌ను