ఉద్ధవ్ శివసేనలో తిరుగుబటు
Actor ProfilePolitician

ఉద్ధవ్ శివసేనలో తిరుగుబటు

Total News1
Movie Updates0
Sources1
ఉద్ధవ్ శివసేనలో తిరుగుబటు
TeluguOne17 Jun 2026
ఉద్ధవ్ శివసేనలో తిరుగుబటు

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గతంలో శివసేనను నిలువునా చీల్చిన ఏక్‌నాథ్‌ షిండే, ఇప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన విభాగానికి మరో భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన పలువురు లోక్‌సభ సభ్యులు షిండే నేతృత్వంలోని శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పరిణామాలు మరవకముందే.. ఇప్పుడు మహారాష్ట్రలో అదే తరహా రాజకీయ ప్రకంపనలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఉద్ధవ్ శివసేన హైకమాండ్ తమ పార్టీ లోక్‌సభ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పుడు వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ రావడంతో ఉద్ధవ్‌ ఠాక్రే శిబిరంలో ఆందోళన, అలజడి మొదలైంది. పరిస్థితి చేతులు దాటిపోకముందే అప్రమత్తమైన ఉద్ధవ్‌ ఠాక్రే, స్వయంగా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ మేరకు. శివసేన (ఉద్దవ్ ) పార్టీకి చెందిన ఆరుగురుర ఎంపీలు, ఇప్పుడు అధికార శివసేన వైపు చూస్తున్నారు. సంజయ్‌ దినా పాటిల్‌, సంజయ్‌ దేశ్‌ముఖ్‌, నగేశ్‌ పాటిల్‌ అష్టికర్‌, ఓంరాజే నింబాల్కర్‌, భౌసాహెబ్‌ వక్చౌరే, సంజయ్‌ జాధవ్‌ లు షిండే వర్గంతో నిరంతరం టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. వీరితో పాటు రాజాభౌ వాజే పేరు కూడా ఈ తిరుగుబాటు జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రేకు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నఎంపీలలో సగానికి పైగా బలం చేజారిపోయే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శివసేన (ఉద్దవ్) ఎంపీలు ఢిల్లీలో ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ షిండే అధికారిక నివాసంలో రహస్యంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమావేశంలో విలీన వ్యూహాన్ని ఖరారు చేసుకున్న అనంతరం.. వీరంతా కలిసి, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంటులో పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక