ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు
Actor ProfilePolitician

ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు
AP7AM28 Jun 2026
ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి లోక్‌సభలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఉన్న మొత్తం 9 మంది ఎంపీలలో ఆరుగురు సభ్యులు అధికార ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరడానికి సిద్ధమయ్యారు. 'ఆపరేషన్ టైగర్' పేరుతో కొన్ని రోజులుగా సాగుతున్న ఈ రహస్య రాజకీయ వ్యూహం నేటి (జూన్ 22) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో అధికారికంగా కార్యరూపం దాల్చనుంది. తిరుగుబాటు ఎంపీలైన సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, భావూసాహెబ్ వాక్‌చౌరే, నగేష్ పాటిల్ అస్తికార్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్‌లు ఇప్పటికే ఉద్ధవ్ వర్గం నిర్వహించిన పార్లమెంటరీ సమావేశానికి గైర్హాజరై తమ అసమ్మతిని స్పష్టం చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండేందుకు అవసరమైన కచ్చితమైన మూడింట రెండు వంతుల మెజారిటీని ఈ తిరుగుబాటు వర్గం సాధించడం గమనార్హం.ఈ తిరుగుబాటుపై ఇప్పటికే ఎంపీలు అస్తికార్, నింబాల్కర్ బహిరంగంగా ప్రకటనలు చేశారు. గత రెండేళ్లుగా తమ నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు అందకపోవడం, పార్టీలోని కొందరు సీనియర్ నేతలు తమపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే తాము ఉద్ధవ్ వర్గాన్ని వీడాల్సి వస్తోందని వారు స్పష్టం చేశారు. తాము కేవలం ఒక శివసేన గ్రూప్ నుంచి అసలైన సిద్ధాంతాలు కలిగిన మరో శివసేనలోకి మారుతున్నామని వారు సమర్థించుకున్నారు. ఈ పరిణామాలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ.. 'ఆపరేషన్ టైగర్' నూటికి