ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ .. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Actor ProfilePolitician

ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ .. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ .. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Zee Telugu19 Aug 2026
ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ .. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Rain Effects: ఎల్‌ నినో ప్రభావంతో తెలంగాణలో కురువాల్సిన వర్షపాతం కంటే తక్కువ నమోదు అయింది. మరోవైపు తెలంగాణలో వర్షాలు పడుతున్న అనుకున్నంత స్థాయిలో పడటం లేదు. ఇక రైతన్న వరుణదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమం లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది.నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా నేటి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీనికి అదనంగా ద్రోణి విస్తరించి ఉన్నట్టు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఏరువాక పున్నమి సందర్భంగా రైతులు దుక్కి దున్నడం ప్రారంభించారు. కరెక్ట్‌గా ఇదే సమయంలో వర్షాలు పడతాయన్న వార్తతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధిక వర్షపాతం.. ముఖ్యంగా కుమరం భీమ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో 9.45 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదు అయింది. జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా 46 శాతం