ఉత్కంఠను కలిగించేలా 'తత్వం' ట్రైలర్
Actor ProfileActor

ఉత్కంఠను కలిగించేలా 'తత్వం' ట్రైలర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉత్కంఠను కలిగించేలా 'తత్వం' ట్రైలర్
Sakshi27 Jul 2026
ఉత్కంఠను కలిగించేలా 'తత్వం' ట్రైలర్

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా మర్డర్‌ మిస్టరీ జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఇదే కోవలో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం 'తత్వం'. దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా ఎడిటర్‌ విప్లవ్‌ నైషదం మాట్లాడుతూ '' ఈ సినిమా జర్నీ ఎంతో స్పెషల్‌.. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. అర్జున్‌ సాఫ్టవేర్‌రంగం నుంచి వచ్చి ఎంతో ఇష్టంతో ఈ సినిమాకు దర్శకత్వం చేశాడు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని డీల్‌ చేశాడు,. ఆద్యంత ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు నాకు సంతోషంగా ఉంది' అన్నారు. సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ '' ఈ రోజుల్లో చిన్న సినిమాల ద్వారా మంచి కంటెంట్‌ను ఇస్తున్నారు. ఆడియన్స్‌ కూడా ఆదరిస్తున్నారు. ఇది కూడా ఆ కోవలోకి వచ్చే చిత్రమే. ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది. మంచి ఎమోషనల్‌ కనెక్టవిటి ఉన్న థ్రిల్లర్. సంగీతానికి స్కోప్‌ ఉన్న చిత్రమిది. అర్జున్‌ ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు' అన్నారు. నిర్మాత వంశీ సీమకుర్తి మాట్లాడుతూ '' ట్రైలర్‌ అందరికి నచ్చింది. సినిమా కూడా చాలా బాగుంటుంది. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లుగా స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశాడు. ఈసినిమా మంచి అవుట్‌ పుట్‌ రావడానికి అందరూ సహకరించారు. అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను'