చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం 2026 జూన్16 తేదీ మంగళవారం సాయంత్రం మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రమైన రోజున పీర్ల(పంజా)ను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అల్లాహ్ ఆరాధించే సమయంలో బెల్లంతో తయారు చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు. ‘మొహర్రం’ అంటే పండుగ రోజు కాదు. ఈ పర్వదినాన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్నే ‘మొహరం’గా పేర్కొంటారు. ప్రాచీన కాలంలో అరబ్బులు(అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా) ఈ క్యాలెండర్ను వాడేవారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈ నెలలో పదో రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజున అమరవీరులను స్మరించుకునే దినోత్సవంగా భావిస్తారు. అయితే ప్రాచీన కాలంలో అషూరా రోజున మొహర్రం మాసంలో పదో రోజున అనేక సంప్రదాయాలను అనుసరించి వేడుకలు నిర్వహించేవారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొహర్రం నెలను తొలి మాసంగా పరిగణిస్తారు. చంద్రుడి దర్శనం తర్వాత ఈ పండుగ తేదీలను నిర్ణయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు మొహర్రం వేడుకలను జరుపుకుంటారు. పదో రోజు ఆషురా దినంగా పాటిస్తారు. అంతకుముందు రోజు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో హిందూ ముస్లింలు కలిసి పీర్ల పండుగను పెద్ద పండుగగా జరుపుకుంటారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే దీనికి కారణం. పీర్ అంటే మహాత్ముడు, ధర్మ దేశికుడని డాక్టర్ టి.దోణప్ప తన జానపద కళా గ్రంథంలో వివరించారు. అందుకే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా నిజాం పాలించిన ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారు జరుపుకోవడం వందల ఏళ్ల నాటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. హజరత్ ఇమామ్ హుసేన్ త్యాగానికి గుర్తుగా పంజా(ప్రతిమ)లను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. చరిత్రను పరిశీలిస్తే, మహ్మద్ ప్రవక్త మరణం అనంతరం హజరత్ అబూబకర్ సిద్ధీఖ్, హజరత్ అలీ
Actor ProfileCelebrity
ఈసారి మొహర్రం ఎప్పుడొచ్చింది? ఈ పండుగ ఎలా ప్రారంభమైందంటే
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•17 Jun 2026
ఈసారి మొహర్రం ఎప్పుడొచ్చింది? ఈ పండుగ ఎలా ప్రారంభమైందంటే