ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. నెలాఖరు కల్లా
Actor ProfilePolitician

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. నెలాఖరు కల్లా

Total News1
Movie Updates0
Sources1
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. నెలాఖరు కల్లా - ద్వారా పీఎఫ్ విత్ డ్రా...ఎంత తీసుకోవచ్చంటే
Zee Telugu18 Jun 2026
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. నెలాఖరు కల్లా - ద్వారా పీఎఫ్ విత్ డ్రా...ఎంత తీసుకోవచ్చంటే

UPI PF Withdrawal: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ భారీ గుడ్ న్యూస్ అందించింది. పీఎఫ్ అకౌంట్లో దాచుకున్న నిధులను ఇక నుంచి నేరుగా యూపీఐ, ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. జూన్ నెల ముగిసేలోపు ఈ సరికొత్త సర్వీసులను ఈపీఎఫ్ఓ సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. గురువారం రోజు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ కీలక అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు తెలిపింది. జూన్ నెల ముగిసే లోపు ఈ కొత్త విధానం అమలు కానున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి 2.01 సర్వర్ ప్రారంభం అవ్వగానే ఈ స్కీమ్ లైవ్ లోకి వస్తుందని.. ఈ సర్వర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఖాతాదారులు యూపీఐ ద్వారా పీఎఫ్ నిధులను నేరుగా తమ బ్యాంకు అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అంతేకాదు ఏటీఏం కార్డులను ఉపయోగించి ఆ నగదును విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. రానున్న కొన్ని రోజుల్లోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈపీఎఫ్ఓ తీసుకువస్తున్న ఈ చారిత్రాత్మక మార్పుపై కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ గత మే నెలలోనే కీలక సంకేతాలు ఇచ్చారు. జూన్ నెల నుంచి పీఎఫ్ ఖాతాదారులు యూపీఐ, ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే వీలు ఉంటుందని పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ పూర్తిగా డిటిజలైజ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని దీంతో పీఎఫ్ డబ్బుల విత్ డ్రా ప్రక్రియ మరింత సులభం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. చందాదారులు తమ సొంత డబ్బులను డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం