ఈ వారం థియేటర్స్ లో ఫుల్ జోష్ .. ఓటీటీ థ్రిల్లింగ్ మూవీస్
Actor ProfileActor

ఈ వారం థియేటర్స్ లో ఫుల్ జోష్ .. ఓటీటీ థ్రిల్లింగ్ మూవీస్

Total News1
Movie Updates0
Sources1
ఈ వారం థియేటర్స్ లో ఫుల్ జోష్ .. ఓటీటీ థ్రిల్లింగ్ మూవీస్
Eenadu15 Jun 2026
ఈ వారం థియేటర్స్ లో ఫుల్ జోష్ .. ఓటీటీ థ్రిల్లింగ్ మూవీస్

Maa Inti Bangaaram || ఇటు వినోదం పాటు, యాక్షన్‌తో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు సమంత (Samantha). ఆమె కథానాయికగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’. రాజ్‌ నిడిమోరు, సమంత, హిమాంక్‌ దువ్వూరు నిర్మించారు. దిగంత్, గుల్షన్‌ దేవయ్య, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 19న (Maa Inti Bangaaram Release Date) థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘కుటుంబ భావోద్వేగాలతో నిండిన యాక్షన్‌ చిత్రమిది. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు.. వెచ్చించే సమయానికి.. అన్నింటికీ న్యాయం చేసేలా ఉంటుంది’ అని చిత్రబృందం చెబుతోంది. Transfer Trimurthulu || ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో అలరించారు వడ్డే నవీన్‌. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’. రాశీ సింగ్‌ కథానాయిక. శిల్పా తులస్కర్, వివేక్‌ రఘువంశీ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 19న (transfer trimurthulu release date) థియేటర్లలోకి రానుంది. బలమైన కథాంశంతో సహజత్వానికి దగ్గరగా ఉండేలా కథ, కథనాలను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. Balan: The Boy (2026) || ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ చిత్రంతో స్నేహబంధం విలువను తెరపై ఆవిష్కరించి.. సినీప్రియుల మనసుల్ని గెల్చుకున్నారు మలయాళ దర్శకుడు చిదంబరం. ఇప్పుడాయన అలాంటి మరో కథతో అలరించడానికి సన్నద్ధమయ్యారు. చిదంబరం దర్శకత్వం వహించిన చిత్రం ‘బాలన్‌: ది బాయ్‌’. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగులోనూ ఈనెల 19న థియేటర్లలోకి రాబోతోంది. Deewana || వెండితెరపై ప్రేమకథలు ఎవర్‌ గ్రీన్‌. ‘చచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదు..’ అంటున్నారు యువ కథానాయకుడు హర్షిత్‌. స్మేహ మణిమేఖలై కలిసి ఆయన నటించిన ప్రేమ కథా చిత్రం ‘దీవాన’. శ్రీకాంత్‌ దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ ఈ మూవీని విడుదల చేస్తోంది. జూన్‌ 19న థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘ఎంత గొప్ప లవ్‌స్టోరీ అయినా