ఈ వీకెండ్ ఓటీటీలో థ్రిల్లింగ్ మూవీస్ .. అలరించే వెబ్ సిరీస్ లివే
Actor ProfileActor

ఈ వీకెండ్ ఓటీటీలో థ్రిల్లింగ్ మూవీస్ .. అలరించే వెబ్ సిరీస్ లివే

Total News1
Movie Updates0
Sources1
ఈ వీకెండ్ ఓటీటీలో థ్రిల్లింగ్ మూవీస్ .. అలరించే వెబ్ సిరీస్ లివే
Eenadu13 Jun 2026
ఈ వీకెండ్ ఓటీటీలో థ్రిల్లింగ్ మూవీస్ .. అలరించే వెబ్ సిరీస్ లివే

సూర్య వశిష్ఠ, దీప్షికా చంద్రన్‌ జంటగా నటించిన సినిమా ‘రమణి కల్యాణం’ (Ramani Kalyanam). విజయ్‌ ఆదిరెడ్డి దర్శకుడు. మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ‘ఈటీవీ విన్‌’ (ETV Win) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్‌ చేసేందుకు మరో మలయాళ మూవీ సిద్ధంగా ఉంది. షేన్‌ నిగమ్‌ (Shane Nigam) ప్రధాన పాత్రలో దర్శకుడు మార్టిన్‌ జోసెఫ్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘దృఢం’ (Dridam). ప్రస్తుతం ‘జియో హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. (రివ్యూ కోసం క్లిక్‌ చేయండి) సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కరుప్పు’(Karuppu). తెలుగులో ‘వీరభద్రుడు’గా విడుదలైంది. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌ అవుతోంది. (రివ్యూ కోసం క్లిక్‌చేయండి) ‘పాతాళ్‌లోక్‌’తో థ్రిల్‌ చేసిన దర్శకుడు ప్రొసిత్‌ రాయ్‌ (Paatal Lok Director). ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా వెబ్‌సిరీస్‌ ‘రాఖ్‌’ (Raakh Webseries). అలీ ఫజల్‌, సోనాలి బింద్రే, ఆమిర్‌ బషీర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇద్దరు టీనేజర్ల మిస్సింగ్‌ కేసును పోలీసు ఆఫీసర్‌ ఎలా చేధించాడన్నది క్లుప్తంగా ఈ సిరీస్‌ కథాంశం. పలు వాస్తవ సంఘటనల అధారంగా ఈ సిరీస్‌ రూపొందింది. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని సినిమాలు/సిరీస్‌లు గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు