
ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు కొంతవరకు బాగున్నప్పటికీ వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. మాసం చివర పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. ఉద్యోగులకు అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. మాసం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిథున రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా వ్యతిరేకత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. డబ్బు వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అన్ని వైపుల నుంచి