ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోలేరు
Actor ProfilePolitician

ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోలేరు

Total News2
Movie Updates0
Sources2
ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోలేరు
Telugu Times16 Jun 2026
ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోలేరు

వైసీపీ హయాంలో జరిగిన మద్యం (Liquor scam) కుంభకోణం దేశంలోనే అతి పెద్దది. దర్యాప్తు అంతిమ లబ్ధిదారు వరకూ చేరుతుంది. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారెవరినీ వదిలిపెట్టేది లేదు అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎక్సైజ్ శాఖ పురోగతిపై రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ (Jagan) పాలనలో మద్యం కుంభకోణం ద్వారా రూ.3,112 కోట్లు దోచుకున్నారని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్వేతపత్రంలో వెల్లడించాం. సిట్ దర్యాప్తులోనూ రూ.3,500 కోట్లకు పైగా కొల్లగొట్టారని తేలింది. ఈ కేసులో 52 మంది నిందితుల్ని గుర్తించారు. 17 మందిని అరెస్టు చేశారు. రూ.260 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు. రూ.20 కోట్లు నగదు స్వాదీనం చేసుకున్నారు అని వివరించారు. ప్రభుత్వంపై బురదచల్లాలనే కుట్రతో ఆ పార్టీ నేతలు జోగి రమేష్ (Jogi Ramesh), ఆయన సోదరుడు రాము (Ramu) ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించినట్లు తేలిందని పేర్కొన్నారు

మద్యం కుంభకోణం దర్యాప్తు అంతిమ లబ్ధిదారు వరకూ చేరుతుంది
Eenadu16 Jun 2026
మద్యం కుంభకోణం దర్యాప్తు అంతిమ లబ్ధిదారు వరకూ చేరుతుంది

ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈనాడు, అమరావతి: ‘‘వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోనే అతి పెద్దది. దర్యాప్తు అంతిమ లబ్ధిదారు వరకూ చేరుతుంది. ఈ కుంభకోణంలో